- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫలించిన వైసీపీ ఎమ్మెల్యే ప్రయత్నాలు.. నూతన పీఠాధిపతి ఫిక్స్..?
<p>దిశ, ఏపీ బ్యూరో: బ్రహ్మంగారి మఠం కొత్త మఠాధిపతి వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. గత మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మరణించడంతో కొత్త మఠాధిపతి ఎంపిక పెద్ద సమస్యగా మారింది. చివరకు రాజకీయ నేతలు రంగంలోకి దిగడంతో వెంకటేశ్వరస్వామి పెద్దకుమారుడు వెంకటాద్రి స్వామి బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతిగా ఎన్నికయ్యారు. వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు కాగా, పెద్ద భార్య కుమారుడే వెంకటాద్రి స్వామి. వెంకటేశ్వరస్వామి మరణించిన తర్వాత కొత్త మఠాధిపతి రేసులో వెంకటాద్రి స్వామి […]</p>

దిశ, ఏపీ బ్యూరో: బ్రహ్మంగారి మఠం కొత్త మఠాధిపతి వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. గత మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మరణించడంతో కొత్త మఠాధిపతి ఎంపిక పెద్ద సమస్యగా మారింది. చివరకు రాజకీయ నేతలు రంగంలోకి దిగడంతో వెంకటేశ్వరస్వామి పెద్దకుమారుడు వెంకటాద్రి స్వామి బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతిగా ఎన్నికయ్యారు. వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు కాగా, పెద్ద భార్య కుమారుడే వెంకటాద్రి స్వామి. వెంకటేశ్వరస్వామి మరణించిన తర్వాత కొత్త మఠాధిపతి రేసులో వెంకటాద్రి స్వామి తెరపైకి వచ్చారు.
వెంకటేశ్వరస్వామి తన మొదటి భార్య మరణానంతరం ప్రకాశం జిల్లాకు చెందిన మహాలక్ష్మమ్మను పెళ్లాడారు. మహాలక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు. మాతృశ్రీ గా తనకు మఠం బాధ్యతలు అప్పగించాలని.. తన పెద్ద కొడుకు మైనారిటీ తీరిన తర్వాత మఠం బాధ్యతలు అప్పగిస్తానంటూ వాదనలు వినిపించారు. ఇదేతరహాలో వెంకటాద్రి స్వామి సోదరుడు వీరభద్రయ్య కూడా పీఠం కోసం పావులు కదిపారు. దీంతో పరిస్థితి జటిలమైంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇతర పీఠాధిపతులు కూడా వెంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. చివరికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి, కందిమల్లయ్య పల్లి సంస్థానం ప్రజల ప్రయత్నాలతో ఈ వ్యవహారం అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ముగిసింది. తొలుత 12వ మఠాధిపతిగా వెంకట్రాదిస్వామి బాధ్యతలు చేపడతారు. ఉత్తరాధికారిగా ఆయన సోదరుడు వీరభద్రస్వామి వ్యవహరిస్తారు. వెంకటాద్రి స్వామి అనంతరం మఠాధిపతిగా మహలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం ఇస్తారు. దీనిపై మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
నాతో చర్చించలేదు..
ఇదిలా ఉంటే మఠం మఠాధిపతి విషయంలో తనతో ఎమ్మెల్యే రఘరామిరెడ్డి ఏమీ చర్చించలేదని వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మి స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇప్పటి వరకు తనతో చర్చించలేదన్నారు. పెద్ద భార్య కుమారులైన వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి మాత్రమే ఎమ్మెల్యేతో సమావేశమయ్యారని శనివారం సాయంత్రం తనతో చర్చిస్తామని ఎమ్మెల్యే తెలిపారన్నారు. అంతే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి ఏకాభిప్రాయంకు రాలేదని చెప్పారు. వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు న్యాయం జరిగితే మాత్రమే ఏకాభిప్రాయానికి వస్తానని మహాలక్ష్మమ్మ స్పష్టం చేశారు.
-వెంకటేశ్వరస్వామి రెండో భార్య మహాలక్ష్మి






