బీపీసీఎల్ నికర లాభం 58 శాతం వృద్ధి

by  |
బీపీసీఎల్ నికర లాభం 58 శాతం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రెండో అతిపెద్ద చమురు శుద్ధి సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 58.44 శాతం వృద్ధితో రూ. 2,589.52 కోట్లను సాధించినట్టు గురువారం వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1,634.32 కోట్ల లాభాలను ఆర్జించింది.

సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం వ్యయం 16.25 శాతం క్షీణించి రూ. 62,436.90 కోట్లకు పడిపోయిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. రెండో త్రైమాసికంలో బీపీసీఎల్ ఆదాయం 12.29 శాతం తగ్గి రూ. 66,331.22 కోట్లకు చేరుకుంది. అలాగే, ఈ త్రైమాసికంలో ఎబిటా 77.56 శాతం పెరిగి రూ. 5,066 కోట్లకు చేరుకోగా, ఎబిటా మార్జిన్ 3.7 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో గురువారం బీపీసీఎల్ షేర్లు 1.33 శాతం తగ్గి రూ. 340.95 వద్ద ట్రేడయ్యాయి.



Next Story

Most Viewed