- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీపీసీఎల్‌లో వాటా కొనేవాళ్లకు ఆహ్వానం!
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా రెండవ అతిపెద్ద చమురు శుద్ధి కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రైవేటీకరణ వైపు అడుగులు పడుతున్నాయి. కేంద్ర బీపీసీఎల్‌లో ఉన్నటువంటి ప్రభుత్వ వాటా 52.98 శాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి వారి కోసం బిడ్లను ఆహ్వానించింది. మే నెల 2 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ సమర్పించాలని కోరుతూ ప్రకటన చేసింది. అయితే, ఈ అంశంలో ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనకూడదని స్పష్టం చేసింది. వాటా అమ్మకంలో బిడ్ల ప్రక్రియను రెండు దశల్లో […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా రెండవ అతిపెద్ద చమురు శుద్ధి కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రైవేటీకరణ వైపు అడుగులు పడుతున్నాయి. కేంద్ర బీపీసీఎల్‌లో ఉన్నటువంటి ప్రభుత్వ వాటా 52.98 శాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి వారి కోసం బిడ్లను ఆహ్వానించింది. మే నెల 2 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ సమర్పించాలని కోరుతూ ప్రకటన చేసింది. అయితే, ఈ అంశంలో ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనకూడదని స్పష్టం చేసింది. వాటా అమ్మకంలో బిడ్ల ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో అర్హత ఉన్న బిడ్లను ఎంపిక చేయడం, రెండవ దశలో ఫైనాన్సియల్ బిడ్లను ఆహ్వానించడం ఉంటుందని పేర్కొన్నారు. 10 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన ప్రవేట్ సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసమ్హరన ద్వారా రూ. 2.10 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ వాటాలున్న బీపీసీఎల్‌లో 52.98 శాతాన్ని ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది.
Tags: Disinvestment Department, Disinvestment Department Of The Finance Ministry, Privatisation Exercise Of Government






