- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి కలుసుకున్న మైనర్లు.. ఇంతలో ప్రేయసిపై..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరకు పెళ్లి చేసుకోమని అడిగిన పాపానికి ప్రేయసి గొంతు నులిమి నదిలో తోసేశాడు ప్రియుడు. అనంతరం తానే ఆమెను హత్య చేశానని పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని చంపా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కికిర్దా గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు స్కూల్స్‌లో చదువుతున్న నాటి నుంచే ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి సమయంలో […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరకు పెళ్లి చేసుకోమని అడిగిన పాపానికి ప్రేయసి గొంతు నులిమి నదిలో తోసేశాడు ప్రియుడు. అనంతరం తానే ఆమెను హత్య చేశానని పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని చంపా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కికిర్దా గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు స్కూల్స్‌లో చదువుతున్న నాటి నుంచే ప్రేమించుకున్నారు.
ఈ క్రమంలో శనివారం రాత్రి సమయంలో బాలికను కలవాలని ప్రియుడు పిలవడంతో ఆమె బయటకు వచ్చింది. ఈ క్రమంలో నది ఒడ్డున కూర్చున్న వారిద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్న అనంతరం.. తనను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్లాలని ఆమె అతడిపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఆ సమయంలో అతను పెళ్లికి నిరాకరించాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన అతడు తన ప్రియురాలి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం హత్యా నేరం నుంచి తప్పించుకోవడానికి ఆమె డెడ్ బాడీని నదిలోకి తోసేసినట్టు తెలిపారు. కానీ, మళ్లీ అతడే పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులు స్థానికుల సాయంతో నదిలో నుంచి యువతి మృతదేహాన్ని బయటకు తీశారు.






