- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ప్రేమికులకు ఏమైంది.. ఎందుకలా చేశారు..?
<p>దిశ, దుబ్బాక : ప్రేమ పెండ్లి చేసుకొని కలకాలం జీవించాలనుకున్నారు. చివరకు అబ్బాయి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా, అమ్మాయి నిద్ర మాత్రలు వేసుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ సంఘటన హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామానికి చెందిన అజయ్.. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు. ఇదే సమయంలో నగరానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. కాగా, కొవిడ్ నేపథ్యంలో అజయ్ స్వగ్రామానికి […]</p>

దిశ, దుబ్బాక : ప్రేమ పెండ్లి చేసుకొని కలకాలం జీవించాలనుకున్నారు. చివరకు అబ్బాయి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా, అమ్మాయి నిద్ర మాత్రలు వేసుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ సంఘటన హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లో కలకలం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామానికి చెందిన అజయ్.. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు. ఇదే సమయంలో నగరానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. కాగా, కొవిడ్ నేపథ్యంలో అజయ్ స్వగ్రామానికి వెళ్లాడు. ఇంతలో ఏమైయిందో తెలియదు గానీ.. అజయ్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా.. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రియురాలు కూడా నిద్రమాత్రలు మింగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు సమాచారం. కొడుకు మృతితో బాధిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకోవడం ఏంటని.. ఏదైనా సమస్య ఉంటే చెప్పాల్సిందని మృతుడి బంధువులు వాపోయారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.






