- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకరితో సహజీవనం.. మరొకరితో పెళ్లి.. ఫొటో గ్రాఫర్ లీలలు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఓ యువతికి మాయ మాటలు చెప్పిన వ్యక్తి పెండ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగు నెలలు సహజీవనం చేశాడు. అనంతరం ముఖం చాటేసి మరొక యువతిని పెండ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన ఫొటో గ్రాఫర్ రాజ్ కుమార్.. కుషాయి గూడకు చెందిన ఓ అమ్మాయికి ఫేస్ బుక్ ద్వారా పరిచయం […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఓ యువతికి మాయ మాటలు చెప్పిన వ్యక్తి పెండ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగు నెలలు సహజీవనం చేశాడు. అనంతరం ముఖం చాటేసి మరొక యువతిని పెండ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన ఫొటో గ్రాఫర్ రాజ్ కుమార్.. కుషాయి గూడకు చెందిన ఓ అమ్మాయికి ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నాను అని చెప్పి.. పెండ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో ఇద్దరూ కలిసి శంషాబాద్ ఆర్టీ కాలనీలో కాపురం పెట్టారు. సరిగ్గా నాలుగు నెలలు ఆమెతో సహజీవనం చేసిన రాజ్ కుమార్.. మనస్పర్థాల కారణంగా ఆమెకు దూరం అయ్యాడు. ఆ తర్వాత మొత్తానికే ముఖం చాటేసి మరొకరిని పెండ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.






