నీచుడా ! ప్రధాని మోడీ తల్లిపై నోరుపారేసుకున్న కాలర్

113

దిశ,వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో #boycottbbc, #BanBBC హ్యష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం భారత్ లోనే కాదూ ప్రపంచ దేశాల్లో చర్చాంశనీయంగా మారింది.

ఏం జరిగింది  

బీబీసీ సంస్థ, యూకేకు చెందిన ప్రముఖ సోప్ ఒపెరా సంస్థలు సంయుక్తంగా ‘ఈస్ట్ఎండర్స్’ పేరుతో 1985నుంచి డ్రామా సిరీస్ ను తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 33 సిరీస్ లు పూర్తయ్యాయి. తాజాగా ఈ డ్రామా సిరీస్ లోని సిక్కు పాత్ర చేసిన ఖీరత్ పనేసర్  ధరించిన ‘టర్బన్’ పై చర్చ జరిగింది.

‘డిబెట్ పేరిట్’ సోమవారం 3గంటల పాటు జరిగిన కార్యక్రమంలో యాంకర్ ప్రియా రాయ్, సిక్కు న్యాయవాది – హర్జాప్ భంగల్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు ప్రోగ్రాం గురించి కాలర్స్ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సీమన్ సింగ్స్ ఇండియన్స్ గురించి మాట్లాడారు. భారత్ లో   సిక్కులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కానీ ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని అన్నారు. అనంతరం ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ ను చెప్పుకోలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో సీమన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు సైతం బీబీసీని బాయ్ కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్స్ తో హోరెత్తిస్తున్నారు.

ఓ నివేదిక ప్రకారం ఈ వార్త వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నెటిజన్లు #boycottofbbc పేరుతో 1 లక్షకు పైగా ట్వీట్లు #banbbc 37,000 ట్వీట్ చేశారు.

ఆ క్లిప్ ను తొలగించిన బీబీసీ 

‘టర్బన్’ పై జరిగిన సందర్భంగా సీమన్ సింగ్ ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీపై చేసిన వ్యాఖ్యల ఆడియో టేపులను బీబీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే సీమన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రియా రాయ్ క్షమాపణలు చెప్పారు. కార్యక్రమంలో జరిగిన ఘటనకు బీబీసీకి ఎటువంటి సంబంధం లేదని,  సీమన్ సింగ్  వివాాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలియలేదన్నారు. అంతేకాదు ఆ ఆడియో టేపుల్ని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేస్తున్నట్లు హోస్ట్ ప్రియా రాయ్ తెలిపింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..