స్టార్ హీరోయిన్ పై నెటిజన్స్ ఫైర్: థర్డ్ గ్రేడ్ నటి.. దిగజారి నటిస్తోందంటూ

by  |
#BoycottRadhikaApte
X

దిశ, వెబ్‌డెస్క్: రాధికా ఆప్టే.. ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండడు. అందం, అభినయానికి కేరాఫ్ అడ్రెస్స్.. బోల్డ్ నెస్ కి పర్మినెంట్ అడ్రెస్స్ గా మారిన ఈ భామకు వివాదాలు కొత్తేమి కాదు. ఎప్పుడు తన బోల్డ్ టంగ్ తో ఎవరో ఒకరిని ఏదో ఒకటి అని వార్తల్లో నిలిచే ఈ భామ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా నిలుస్తోంది. బాయ్‌కాట్‌ రాధికా ఆప్టే..అంటూ నెటిజన్లు రాధికపై విరుచుకు పడుతున్నారు. అంతగా రాధికా ఏం చేసింది అంటే.. భారత సంప్రదాయాలను కించపరిచేలా నటిస్తోందని, అంతలా దిగజారి నటిస్తున్నా ఆమెకు బాలీవుడ్ దర్శకులు అవకాశాలు ఎలా ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు.

‘వహ్‌! లైఫ్‌ హో తో ఐసీ!’(2005) ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన రాధికా ఆప్టే అతి కొద్దీ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తెలుగులో సైతం బాలయ్య బాబు సరసన లెజెండ్ లో నటించి మెప్పించింది. ఆ తరువాత రక్త చరిత్ర, ధోనీ, లయన్‌ లాంటి సినిమాల్లోనూ కనిపించి తెలుగు ప్రేక్షకుల చేత మంచి మార్కులే వేయించుకోంది. ఇక అమ్మడు ఉన్నకొద్దీ హాలీవుడ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ బోల్డ్ కంటెంట్ కి సై అంటూ.. న్యూడ్ సీన్స్ చేయడం మొదలు పెట్టింది. ఇలా న్యూడ్‌, సెమీ న్యూడ్‌ సీన్లతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన రాధికా మరో పక్క మీటూ అంటూ దర్శకులు, నిర్మాతల మీద నోరు పారేసుకోంది. తెలుగులోనూ ఒక నిర్మాత తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం రాధికాపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/srishirajIND/status/1426004129864839169?s=20

రాధికా కేవలం డబ్బు కోసమే అలాంటి పాత్రల్లో నటిస్తున్నదని, భారత సంప్రదాయాలకు వ్యతిరేకంగా ముందుకెళ్తోందని, విలువలు విడిచిపెట్టి మరీ దిగజారిందని నెటిజన్లు విమర్శలకు దిగారు. ఇంతలా దిగజారుతున్నా వాళ్లకు అవకాశాలిచ్చి మరీ ప్రొత్సహిస్తున్న బాలీవుడ్‌ ని ఏకీపారేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లో జరిగిన అత్యచారాల పై బాలీవుడ్ సెలబ్రెటీలంతా ఒక్కటై న్యాయం కోసం అంటూ ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే అలాగే ఇప్పుడు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఎందుకు ఏ ఒక్క సెలబ్రెటీ మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు. మీరు సినిమాలో చేస్తే అది కూడా పోర్న్ లాగే ఉంటుంది. మరి అలాంటి వారిని కూడా అరెస్ట్ చేయాలి అంటూ మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ #BoycottRadhikaApte అనే ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ టాప్ 10లో ఉండడం విశేషం. మరి ఈ విషయమై రాధికా ఆప్టే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో చూడాలి.

https://twitter.com/BaluPat12082924/status/1426022839627382791?s=20

Next Story

Most Viewed