హోలీ నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్

by Shyam |

<p>దిశ, హైదరాబాద్‌ కోవిడ్‌ -19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోలీ సంబరాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధించాలంటూ.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైదరాబాద్‌లోని మణికొండకి చెందిన గంపా సిద్దలక్ష్మి ఈ మేరకు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 9 లేదా 10 తేదీల్లో హోలీ సంబరాలు జరుగనున్నాయని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ వేడుకలని నిషేధించాలని రిట్‌ పిటిషన్‌లో కోరారు. వేడుకలని నిషేధించడం ద్వారా ప్రజలని వైరస్‌ బారినపడకుండా [&hellip;]</p>

హోలీ నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్
X

దిశ, హైదరాబాద్‌
కోవిడ్‌ -19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోలీ సంబరాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధించాలంటూ.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైదరాబాద్‌లోని మణికొండకి చెందిన గంపా సిద్దలక్ష్మి ఈ మేరకు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 9 లేదా 10 తేదీల్లో హోలీ సంబరాలు జరుగనున్నాయని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ వేడుకలని నిషేధించాలని రిట్‌ పిటిషన్‌లో కోరారు. వేడుకలని నిషేధించడం ద్వారా ప్రజలని వైరస్‌ బారినపడకుండా కాపాడవచ్చని అందులో పేర్కొన్నారు. కోవిడ్‌ వైరస్ విజృంభిస్తున్న‌ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ప్రజలు కూడా వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మోడీ ట్విటర్‌లో తన సందేశాన్ని ట్వీట్‌ చేశారు.

tags;boycott holi festival,pill in high court, gampa siddha lakshmi

Next Story