నా ఆఖరి కోరిక తీర్చండి.. ప్రధాని మోడీకి 16 ఏళ్ల బాలుడి సూసైడ్ నోట్

by  |
నా ఆఖరి కోరిక తీర్చండి.. ప్రధాని మోడీకి 16 ఏళ్ల బాలుడి సూసైడ్ నోట్
X

దిశ, వెబ్‌డెస్క్ : తన ఆఖరు కోరిక తీర్చాలని 16ఏళ్ల బాలుడు ప్రధాని మోడీకి సూసైడ్ నోట్ రాసి మరీ రైల్వే ట్రాక్స్‌పై శవమై కనిపించాడు. మృతుని పాకెట్‌లో దొరికిన సూసైడ్ నోట్‌లో ఇలా రాసి ఉంది. తాను మంచి డ్యాన్సర్ కావాలనుకున్నానని, అది నేరవేరకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు.

వివరాల్లోకివెళితే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్‌‌కు చెందిన ఓ బాలుడికి మంచి డ్యాన్సర్ కావాలనే ఆశయం ఉండేది. కానీ, వారి తల్లిదండ్రులు మరియు స్నేహితులు ప్రోత్సహించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. చనిపోయే ముందు ఆ బాలుడు సూసైడ్ నోట్ రాశాడు. ప్రధాని మోడీ మీరే నా ఆఖరు కోరిక తీర్చాలని అందులో వేడుకున్నాడు. అదేంటంటే.. ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ పాడిన పాటకు నేపాలీ కళాకారుడు సుశాంత్ ఖత్రి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయాలని.. తన జీవితం ఆధారంగా ఓ వీడియో అల్బబ్‌ను రూపొందించాలని దేశ ప్రధానిని సూసైడ్ నోట్ ద్వారా కోరారు. ఇదే తన లాస్ట్ విష్ అని లెటర్‌లో మెన్షన్ చేశాడు.

బాలుడు ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆదివారం రాత్రి రైల్వే ట్రాక్ మీద పడుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక పోలీస్ ఇన్‌చార్జి సంజీవ్ నయన్ శర్మ తెలిపారు. కాగా, దీనికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed