ఫిలిం నగర్‌లో విషాదం…

by  |
ఫిలిం నగర్‌లో విషాదం…
X

ఫిలింనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో చోటు చేసుకుంది. ఆదివారం సెలవుదినం కావడంతో పిల్లలంతా ఆడుకుంటుండగా… బాల్ ఎగిరి దూరంగా పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడింది. దీంతో ఓ తొమ్మిందేండ్ల పిల్లవాడు బాల్ తీసుకురావడానికి ఆ షెడ్డుపైకి ఎక్కాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు తాకడంతో విద్యుత్ఘానికి గురై బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి బాలుడి మృతదేహం తరలించారు.



Next Story