- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉయ్యాలే.. ఆ పిల్లాడికి ఉరి అయ్యింది
<p>దిశ, మెదక్: ఉయ్యాలే.. ఆ పిల్లాడికి ఉరి తాడుగా మారింది. లాక్‌డౌన్ కావడంతో సరదాగా ఆడుకోవాలన్న ఆ బాలుడి కోరికకు కాలం కళ్లెం వేసింది. ఎప్పుడూ ఇంట్లో సందడి సందడిగా తిరిగే ఆ బాలుడి ఈరోజే చివరి రోజు అయ్యింది. రోజూ ఆ చిన్నారితో ఆనందంగా గడిపే ఆ తల్లిదండ్రుల గుండె కన్నీళ్లతో చెరువయ్యింది. ఉయ్యాల ఊగుతూ గొంతుకు ఉరి పడి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో […]</p>

X
దిశ, మెదక్: ఉయ్యాలే.. ఆ పిల్లాడికి ఉరి తాడుగా మారింది. లాక్‌డౌన్ కావడంతో సరదాగా ఆడుకోవాలన్న ఆ బాలుడి కోరికకు కాలం కళ్లెం వేసింది. ఎప్పుడూ ఇంట్లో సందడి సందడిగా తిరిగే ఆ బాలుడి ఈరోజే చివరి రోజు అయ్యింది. రోజూ ఆ చిన్నారితో ఆనందంగా గడిపే ఆ తల్లిదండ్రుల గుండె కన్నీళ్లతో చెరువయ్యింది. ఉయ్యాల ఊగుతూ గొంతుకు ఉరి పడి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బీమా నరసింహులు కుమారుడు రేవంత్ ఇంట్లో దూలానికి వేలాడదీసిన ఉయ్యాలలో నిల్చుని ఊగుతున్నాడు. ఉయ్యాల ఊగుతున్నాకొద్దీ రేవంత్ ఆనందంలో కేరింతలు కొట్టాడు. ఇంతలో అకస్మాత్తుగా గొంతు మూగబోయింది. ఏం జరిగిందో అని తల్లిదండ్రులు వచ్చి చూసే సరికి ఆ బాలుడి గొంతుకు ఉరి పడింది.
Next Story






