Instagram love : పెళ్లికి నో చెప్పిందని బిల్డింగ్ మీద నుంచి దూకి..!

by  |
Instagram love : పెళ్లికి నో చెప్పిందని బిల్డింగ్ మీద నుంచి దూకి..!
X

దిశ, కూకట్​పల్లి : ఇన్స్ స్టాగ్రామ్​వేదికగా ప్రేమించుకున్నారు.. పెండ్లి చేసుకుందామని అడిగితే కాదన్నదని యువతి ఇంటి ముందు మద్యం సేవించి నానా హంగామా సృష్టించిన వ్యక్తి అదే భవనం నాలుగవ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బాలానగర్​ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వహీదుద్దిన్ కథనం ప్రకారం.. మూసాపేట్ సర్కిల్​రెయిన్​బో విస్తా అపార్ట్​మెంట్‌లోని ప్లాట్​నంబర్​409లో నివాసముంటున్న కొడ్లి కృష్ణ పెద్దకొడుకు కొడ్లి శుభం(27) అమెజాన్‌లో పని చేస్తున్నాడు. బాలానగర్​శోభన కాలనీ రోడ్డు నంబర్​1లో నివాసముంటున్న సోనియా గోగికర్​అనే యువతితో శుభం గత కొంత కాలంగా ఇన్స్టాగ్రామ్​చాటింగ్ చేస్తున్నాడు. చనువు మరింత పెరగడంతో అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలోనే శుభం పెళ్లి చేసుకుందామని అని చెప్పగా యువతి అందుకు నిరాకరించింది. దీంతో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మద్యం సేవించి శుభం యువతి ఇంటికి వెళ్లాడు.

యువతికి ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పాడు. యువతి బయటికు రాకపోవడంతో నాలుగవ అంతస్థులో ఉంటున్న యువతి ఇంటికి వెళ్లి యువతిని బయటికి రావాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే అమ్మాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదం జరిగింది. యువతిని బయటకు రాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఎంతకూ యువతి బయటికు రాక పోవడంతో నాలుగవ అంతస్థు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుభం కిందకు దూకడంతో పెద్దగా శబ్దం వచ్చింది. వెంటనే బయటికి వచ్చిన స్థానికులు అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గ మధ్యంలోనే పరిస్థితి విషమించి శుభం మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న బాలానగర్​ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, తమ కొడుకు శుభంను యువతి కుటుంబ సభ్యులు కిందికి తోసేసి హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న బాలానగర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed