రాజధాని తరలింపుపై బొత్స సంచలన వ్యాఖ్యలు.. ఉద్యోగుల్లో టెన్షన్

by  |
Bothsa
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాజధాని తరలింపుపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణంలోనైనా విశాఖను పరిపాలన రాజధానిగా మారుస్తామని ప్రకటించారు. ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకుండా సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని బొత్స గుర్తు చేశారు. దీనిలో భాగంగానే రాజదానిని తరలిస్తామని ఆయన చెప్పారు. మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని తెలిపారు. పరిపాలన భవనాల కోసం ఇప్పటికే మధురవాడ, పుప్పాలవాడ, భీమిలి ప్రాంతాల్లో స్థలాలను అధికారులు గుర్తించారని చెప్పారు. కోర్టును ఒప్పించి మూడు రాజధానుల నుంచి పాలన సాగిస్తామని వివరించారు.

అయితే బొత్స వ్యాఖ్యలపై రాజకీయ పక్షాలు, ఉద్యోగులు, ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వెలుబడతున్నాయి. అనాలోచిత, హడావుడి నిర్ణయాలు సరికాదంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ సైతం ఆందోళనకు సిద్ధమవుతోంది. కేసు కోర్టులో ఉండగా రాజధానులపై ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బొత్స వ్యాఖ్యలపై సచివాలయ ఉద్యోగుల్లోనూ తీవ్ర టెన్షన్ నెలకొంది. తెలంగాణ నుంచి ఏపీకి.. ఏపీ నుంచి విశాఖ, కర్నూలు తరలమంటే ఇబ్బందే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.


Next Story

Most Viewed