కొత్త వేరియంట్స్‌ కోసం ‘బూస్టర్ డోస్’ తప్పనిసరి : AIIMS చీఫ్

by  |
randeep-guleria
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్ల నుంచి రక్షణ పొందాలంటే బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని AIIMS చీఫ్ రణదీప్ గులేరియా స్పష్టంచేశారు. రోజురోజుకూ కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా థర్డ్‌వేవ్ నేపథ్యంలో ముందస్తుగా పిల్లలపైనా కోవాగ్జిన్ ట్రయల్స్ నడుస్తున్నాయని వివరించారు.

సెప్టెంబర్ నాటికి పిల్లలపై కోవాగ్జిన్ ట్రయల్స్ ఫలితాలు వెల్లడవుతాయని రణదీప్ గులేరియా చెప్పారు. అంతేకాకుండా అదే నెల చివరివారంలో పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఏయిమ్స్ చీఫ్ చెప్పుకొచ్చారు. దేశంలో కరోనా ఇంకా అంతరించిపోలేదని, కావున దేశప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు.

Next Story