బొంతు ఎక్కడ..? టీఆర్‌ఎస్‌కు దూరమయ్యారా?

by Shyam |   (  Updated:2021-06-28 04:48:51  IST  )

<p>దిశ ప్రతినిధి, మేడ్చల్: గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రాజకీయ అనిశ్చితిపై చర్చ నడుస్తోంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా బొంతు రామ్మోహన్‌కు పేరుంది. దీనివల్లనే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొంతు రామ్మోహన్‌ను టీఆర్‌ఎస్ తరపున పోటీ చేయిస్తారని ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేకపోవడంతో తనకు వద్దని రామ్మెహన్ అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ గ్రేటర్ [&hellip;]</p>

బొంతు ఎక్కడ..? టీఆర్‌ఎస్‌కు దూరమయ్యారా?
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రాజకీయ అనిశ్చితిపై చర్చ నడుస్తోంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా బొంతు రామ్మోహన్‌కు పేరుంది. దీనివల్లనే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొంతు రామ్మోహన్‌ను టీఆర్‌ఎస్ తరపున పోటీ చేయిస్తారని ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేకపోవడంతో తనకు వద్దని రామ్మెహన్ అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కానీ గ్రేటర్ మేయర్ స్థానం మహిళకు రిజర్వుడ్ కావడంతో రామ్మోహన్ తన భార్య బొంతు శ్రీదేవిని కార్పొరేటర్ గా పోటీ చేయించారు. తన భార్యను మేయర్ చేసేందుకు సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్ ను కలిసి అభ్యర్థించినా ఫలితం లేదని తెలిసింది. దీంతో అప్పటి నుంచి బొంతు పార్టీకి అంటీముంటనట్లుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ వెంట కూడా ఈ మధ్య కనిపించడం లేదు. అదేవిధంగా నగరంలో మంత్రి కేటీఆర్ పాల్గొనే ఏ కార్యక్రమంలోనూ దర్శనమివ్వడం లేదు. దీంతో మాజీ మేయర్ పార్టీ మీద అలిగారా..? లేక పార్టీ పెద్దలే రామ్మోహన్‌ను దూరం పెట్టారా..? అనే అంశం చర్చనీయాంశంగా మారింది..

Next Story