అన్నదాతలకు అండగా బాండ్ కంపెనీ

by  |
అన్నదాతలకు అండగా బాండ్ కంపెనీ
X

దిశ, భద్రాచలం: చర్ల మండల పరిధిలోని గొంపల్లి లంక చేలల్లో ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి తోటలు దెబ్బతిన్నాయి. విత్తన ప్రభావం వల్లనే మొక్కలు పాడై భారీ నష్టం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పలుమార్లు తోటలను పరిశీలించి బాక్టీరియల్ ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్ళు తెగులుగా గుర్తించారు. విత్తన లోపం కాదని తేలిపోవడంతో ఏమి చేయాలో రైతులకు అర్థం కావడం లేదు. వాతావరణ పరిస్థితులు కారణమైనప్పటికీ పంట నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని విఎన్‌ఆర్ 788 రకం విత్తనం రైతులకు సిఫార్సు చేసిన బాండ్ కంపెనీ యోచిస్తున్నట్లుగా సమాచారం.

రైతులకు ఎంతో కొంత సహాయం చేయాలని విత్తన వ్యాపారులు సైతం కంపెనీపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.అన్నదాతలకు తగిన చేయూతని ఇవ్వడానికి‌ సిబ్బంది రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Next Story

Most Viewed