భాస్కర్ కు బన్నీ వాగ్ధానం..

by  |
భాస్కర్ కు బన్నీ వాగ్ధానం..
X

బొమ్మరిల్లు భాస్కర్… సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నడు. కానీ.. మళ్లీ అలాంటి హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. ఆయన చేసిన పరుగు, ఒంగోలు గిత్త చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేకపోయాయి. ఆ తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చిన భాస్కర్… ఇప్పుడు అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ మూవీ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్, సాంగ్స్ ఆకట్టుకోగా… సినిమా దాదాపు పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది.

కాగా తర్వాతి సినిమాను అల్లు శిరీష్ తో ప్లాన్ చేస్తున్నాడట భాస్కర్. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయితే అల్లు అర్జున్ తనతో సినిమా చేసేందుకు మాటిచ్చాడట. దీంతో శిరీష్ సినిమాకు పకడ్బంధి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట భాస్కర్. ఎలాగైనా మరోసారి బన్నీని డైరెక్ట్ చేయాలని ఆశపడుతున్నాడట. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పరుగు సినిమా యావరేజ్ గా నిలిచింది.

Tags: Allu Arjun, Allu Sirish, Bommarillu Bhaskar, Tollywood, Most eligible bachelor

Next Story

Most Viewed