ప్రేమలో.. ఆ రెండు జంటలు

by  |
ప్రేమలో.. ఆ రెండు జంటలు
X

దిశ, వెబ్‌డెస్క్ : లాక్‌డౌన్ ఆంక్షల తర్వాత, అన్ని సినీ ఇండస్ట్రీలకు చెందిన తారలు.. మాల్దీవుల్లో చిల్లవుట్ అయిన విషయం తెలిసిందే. కొత్త జంటలు, ప్రేమ పక్షులు, లవ్లీ కపుల్స్ అందరూ సముద్ర తీరంలో ఎంజాయ్ చేసి రాగా.. న్యూ ఇయర్‌ను స్పెషల్‌గా సెలెబ్రేట్ చేసుకునేందుకు మరోసారి మాల్దీవ్స్, గోవాకు చెక్కేశారు. ఈ నేపథ్యంలోనే.. ఇన్నాళ్లుగా తమ మధ్య ఏం లేదంటూ రిలేషన్‌షిప్‌ను దాస్తూవస్తున్న బాలీవుడ్ యంగ్ లవ్ బర్డ్స్ మరోసారి కెమెరా కంటికి చిక్కారు.

అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. చేసినవి రెండు సినిమాలే అయినా, బీటౌన్‌లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్లే బెస్ట్ ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. అయితే ఈ బ్యూటిఫుల్ హీరోయిన్, యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉండగా, గతంలో ఓ సారి జంటగా కనిపించి ఈ రూమర్లకు అవకాశం కల్పించారు. తాజాగా వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చినా.. ఎవరికి వారు సింగిల్‌గానే రావడంతో ఎక్కడికి వెళుతున్నారో క్లారిటీ లేదు. కానీ ఆ తర్వాత ఆయా యాక్టర్స్ గోవాలో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆర్యన్, జాన్వీ కలిసి మ్యాచింగ్ వైట్ డ్రెస్‌ల్లో లంచ్‌కు వెళ్లిన ఫొటోలు కూడా దర్శనమివ్వడంతో ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ‘దోస్తానా 2’ కోసం వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో వీరి ప్రేమ బంధం మరింత బలపడనుందని బాలీవుడ్ టాక్.

చాలా తక్కువ టైమ్‌లో ఎక్కువ ఫేమ్ సంపాదించుకోవడంతో పాటు బాలీవుడ్ దివా దీపిక, బెబో కరీనా కపూర్ ఖాన్‌ నుంచి కూడా ప్రశంసలు దక్కించుకున్న నటి అనన్య పాండే. కాగా ఈ బ్యూటీ ‘కాలీపీలి’ సినిమాలో తన కోస్టార్ ఇషాన్ ఖట్టర్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆ టైమ్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. ఈ యంగ్ కపుల్ న్యూ ఇయర్‌ను మాల్దీవ్స్‌లో సెలెబ్రేట్ చేసుకున్నట్టు సమాచారం. అక్కడి నుంచి తిరిగొస్తున్న వీరిద్దరి ఫొటోలు కెమెరాకు చిక్కడంతో రూమర్స్‌ నిజమేనన్న టాక్ వినిపిస్తోంది. మరి అనన్య, ఇషాన్‌లు తమ రిలేషన్‌పై వస్తున్న రూమర్లకు చెక్ పెడతారా? లేదా వేచి చూడాలి.

కాగా అనన్య.. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫైటర్’లో ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే.



Next Story