వెబ్ సిరీస్ కోసం నగ్నంగా నటించిన స్టార్ హీరో

by  |
వెబ్ సిరీస్ కోసం నగ్నంగా నటించిన స్టార్ హీరో
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం చిత్ర పరిశ్రమ తన ట్రెండ్ మార్చుకుంటుంది. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించడానికి కొత్త పంథాలను వెతుకుతుంది. ఇక హీరోలు సైతం ఏ పాత్రకైనా సై అంటూ ముందుకు వస్తున్నారు. తాజాగా ఒక వెబ్ సిరీస్ కోసం బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నగ్నంగా నటించి ఔరా అనిపించాడు. విజయ్ వర్మ, రాధికా ఆప్టే జంటగా పూజ శెట్టి దర్శకత్వంలో ‘ఓకే కంప్యూటర్’ అనే వెబ్ సిరీస్ రూపొందుకుంటుంది. ఈ సిరీస్ లో జాకీ ష్రాఫ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. డిస్నీ హాట్ స్టార్ కోసం తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది.

ప్రస్తుతం యువత కేవలం కంప్యూటర్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. కానీ పర్యావరణాన్ని పట్టించుకోవడం లేదు. టెక్నాలజీతో పాటు పర్యావరణానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇక ఈ సిరీస్ లో జాకీ ష్రాఫ్ పర్యావరణాన్ని ప్రేమించే ప్రకృతి ప్రేమికుడు పుష్పక్ గా కనిపించనున్నారు. దీనికోసం ఆయన నగ్నంగా నటించారు. పువ్వులు, ఆకులు కప్పుకొని కనిపించారు. ప్రస్తుతం జాకీ ష్రాఫ్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story

Most Viewed