స్టార్ హీరోయిన్ ని చేస్తా.. ఒక రాత్రి నాతో గడుపు అన్నాడు- నటి

by  |
nenna gupta book
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ విన్నా నటి నీనా గుప్తా బుక్ గురించే చర్చ. తన బయోగ్రఫీ ని ‘సచ్‌ కహున్‌ తో’ అనే బుక్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్న నీనా అందులో తన జీవితంలో జరిగిన అన్ని విషయాలను పొందుపరిచారు. పెళ్లి, విడాకులు, పెళ్లికి ముందే గర్భం దాల్చడం, కెరీర్‌లో ఆటంకాలు, ఒంటరి తల్లిగా తాను ఎదుర్కొన్న సమస్యలు, మళ్లీ పెళ్లి వీటన్నింటి గురించి చెప్పుకొచ్చింది. ఇక ఇందులో కొన్ని విషాద ఘటనలు ఉండగా.. మరికొన్ని దారుణ ఘటనలు ఉన్నాయి. ఇక ఆ దారుణ ఘటనలో తానూ సినిమా ఛాన్సుల కోసం ఎంతగా అవస్థ పడిందో తెలిపింది. ఒక సినిమా అవకాశం కోసం సౌత్ ప్రొడ్యూసర్ తనతో గదిలో ఉండాలని అడిగాడని పాత జ్ఞాపకాలను నెమరువేసుకొంది.

” ఒక దక్షిణాది నిర్మాత నన్ను హోటల్ కి రమ్మని పిలిచాడు. అది ముంబైలోని పృథ్వీ థియేటర్‌కు దగ్గర్లో ఓ హోటల్. నేను షూటింగ్ పూర్తిచేసుకొని ఆయనకు ఫోన్ చేసి లాబీలోకి రావాలని కోరాను. కానీ ఆయన మాత్రం నన్ను గదికి రావాలని పట్టుబట్టాడు. దీంతో నేను రూమ్ కి వెళ్ళాను. అక్కడ అయన ఉపన్యాసం మొదలుపెట్టాడు. ఆ నిర్మాత చాలామంది స్టార్ హీరోయిన్లను పరిచయం చేసానని చెప్పుకొన్నాడు. నన్ను కూడా ఇంకో స్టార్ హీరోయిన్ చేస్తానని చెప్పాడు. తన దగ్గర ఉన్న కథలో మంచి పాత్ర ఇస్తానని చెప్పాడు

తీరా గదికి వెళ్లాక కథలో తన పాత్రకు అంత ప్రాధాన్యత లేదని నాకు అర్థమైంది. ఆ అవకాశాన్నీ సున్నితంగా తిరస్కరించి గదినుండి బయటపడాలనుకోలోపు.. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావ్.. ఈ రాత్రి నాతో గడపవా..? అని అడిగాడు. ఆ మాటతో నా శరీరం మీద ఐస్ వాటర్ బకెట్ తో గుమ్మరించినట్టు అనిపించింది. నా శరీరమంతా గడ్డకట్టుకుపోయింది. ఇక ఇంతలో ఆయనే సోఫాలో ఉన్న నా బ్యాగ్ ని చేతిలో పెట్టి.. ఇందులో బలవంతం ఏమిలేదు.. నీకు నచ్చితేనే అని చెప్పాడు. వెంటనే అక్కడి నుండి పరుగుతీసాను” అంటూ చెప్పుకొచ్చింది. ఈ బుక్ లో ఇలాంటి ఆసక్తికర సంఘటనలు చాలా ఉన్నాయని నీనా తెలిపింది.

Next Story