రణ్‌బీర్ రేపిస్ట్.. దీపికా ఓ సైకో: కంగనా

by  |
రణ్‌బీర్ రేపిస్ట్.. దీపికా ఓ సైకో: కంగనా
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా హీరో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రణ్‌బీర్‌కు ఆడోళ్లంటే పిచ్చి అని.. అతనో రేపిస్ట్ అంటూ ఘాటు విమర్శలు గుప్పించింది. ఇక దీపికా ఓ మానసిక రోగి అంటూ ట్వీట్ చేసింది.

‘రణ్‌బీర్ లంగాల వేటలో ఉన్నాఎవరూ రేపిస్ట్ అనరు. తనకు తాను పిచ్చిదని ప్రకటించుకున్న దీపికను ఎవరూ సైకో అనడానికి సాహసించరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని.. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారికి మాత్రం ఇష్టమొచ్చిన పేర్లు పెడతారు.’ అని కంగనా ధ్వజమెత్తింది. బాలీవుడ్ హీరో సుషాంత్ మృతిపై కంగనా బాలీవుడ్‌ పెద్ద తలకాయలపై విమర్శలు ఎక్కుపెట్టింది. సుశాంత్ మరణం వెనుక బాలీవుడ్ పెద్దల హస్తాలు ఉన్నాయని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే.

Next Story