సుశాంత్ కేసు : కంగనాను విచారించనున్న పోలీసులు

175

సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాలీవుడ్‌లో వివాదానికి దారితీసింది. ముఖ్యంగా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కంగనా రనౌత్.. కేవలం నెపోటిజం వల్లే తాను చనిపోయాడని వాదిస్తోంది. కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్ వంటి వారే సుశాంత్ మరణానికి కారణమని ఆరోపించింది. నేషనల్ మీడియాలో లైవ్ ప్రోగ్రామ్‌లో తను చేసిన ఆరోపణలతో రచ్చ రచ్చ అయింది. సుశాంత్ కెరియర్‌ను నాశనం చేసి.. తను సూసైడ్ చేసుకోవడానికి కారణమైన వారికి పోలీసులు ఎందుకు నోటీసులు పంపడం లేదని ప్రశ్నించిన ఆమె.. పనిలోపనిగా హీరోయిన్లు స్వర భాస్కర్, తాప్సీ పన్ను, రిచా చడ్డా, సంజనా సంఘీలను కూడా విమర్శించింది.

ఇదిలా ఉంటే, సుశాంత్ కేసులో పలువురు సినీ ప్రముఖులను విచారించిన పోలీసులు.. ఇప్పుడు కంగనాను విచారించనున్నారు. ఇప్పటికే తనకు సమన్లు జారీ చేయగా.. తను హోమ్‌టౌన్ మలాలిలో ఉన్నానని, అక్కడికొచ్చి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవచ్చని తెలిపింది. కాగా కొత్తగా మరోసారి కంగనాను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు పోలీసులు.