- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆలియా భట్
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతుందని బీటౌన్ టాక్. ఇప్పటికే గంగూభాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న భామ.. ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉంది. డైరెక్టర్ రేసుల్ పూకుట్టి డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం సైనో ఇండియన్ వార్‌లో అమరులైన బాబా హర్భజన్ సింగ్ వీరోచిత కథ గురించి ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే ‘ప్లస్ మైనస్’ అనే సినిమాలో ఆయన జీవితం గురించి […]</p>

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతుందని బీటౌన్ టాక్. ఇప్పటికే గంగూభాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న భామ.. ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉంది. డైరెక్టర్ రేసుల్ పూకుట్టి డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం సైనో ఇండియన్ వార్‌లో అమరులైన బాబా హర్భజన్ సింగ్ వీరోచిత కథ గురించి ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే ‘ప్లస్ మైనస్’ అనే సినిమాలో ఆయన జీవితం గురించి వివరించగా.. దాంతోపాటు దర్శకుడు రేసుల్ ప్రజెంట్ ఇండో-చైనా ఉద్రిక్తతను కూడా తెరమీదకు తీసుకురానున్నారు.
1967లో నాథులాలో జరిగిన ఇండో-చైనా యుద్ధం నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో లవ్ స్టోరీ యాడ్ చేస్తూ తీసుకొస్తున్నట్లు, ఇందులో ఆలియా భట్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. సినిమా టైటిల్ కూడా ఫైనల్ అయిపోయిందనేది బాలీవుడ్ సమాచారం. పిహార్వా అనే టైటిల్ కన్‌ఫర్మ్ కాగా, త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.






