యాక్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. మ్యూజిక్ థెరపీతో రికవరీ?

by  |
యాక్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. మ్యూజిక్ థెరపీతో రికవరీ?
X

దిశ, సినిమా : సీనియర్ నటుడు రాహుల్ రాయ్ సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. గతేడాది నవంబర్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఈ యాక్టర్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాగా నార్మల్ అయ్యేందుకు స్పెషల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఆయన.. ఇందులో భాగంగా మ్యూజిక్ లెస్సన్స్ కూడా వింటున్నట్లు తెలిపారు. స్పీచ్ థెరపీ ప్రాసెస్‌లో భాగంగా సంగీత పాఠాలు నేర్చుకుంటున్నానని, ఇలాంటి ఇబ్బంది ఉన్నవారు తప్పక ట్రై చేయొచ్చని సూచించారు. బ్రెయిన్ స్ట్రోక్ రికవరీకి చాలా సమయం తీసుకుంటుందని, ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో వోకల్ కార్డ్స్‌పై చాలా ఎఫెక్ట్ పడుతుందని, సరిగ్గా మాట్లాడలేమని తెలిపిన రాహుల్ రాయ్.. ఇప్పుడు తనముందున్న ప్రధానలక్ష్యం ప్రాపర్‌గా మాట్లాడడమే అని, అందుకోసం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నానని చెప్పారు. తన వోకల్ కార్డ్స్ బలోపేతం చేసేందుకు సోదరి ప్రియాంకరాయ్ స్పీచ్ థెరపీ ట్రీట్‌మెంట్ ఇస్తోందని, త్వరలోనే క్యూర్ అవుతానని చెప్పాడు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే క్రమంలో.. మరికొద్ది రోజుల్లో ప్రియాంకఅండ్‌రాహుల్‌రాయ్ చాలెంజ్‌తో మీ ముందుకు వస్తామని.. ట్రెండ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అభిమానులను కోరారు.

Next Story

Most Viewed