- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పంజాబ్ ఐకాన్’గా సోనూసూద్
<p>దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో వలసకూలీల పాలిట దేవుడిగా మారిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. సోనూ సూద్‌ను ’పంజాబ్ ఐకాన్’గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ ఎన్నికల అధికారి ఎస్.కరుణ రాజు ప్రతిపాదన మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాకు చెందిన సోనూ సూద్ లాక్‌డౌన్ సమయంలో వలసకూలీలను ప్రత్యేక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో వలసకూలీల పాలిట దేవుడిగా మారిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. సోనూ సూద్‌ను ’పంజాబ్ ఐకాన్’గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ ఎన్నికల అధికారి ఎస్.కరుణ రాజు ప్రతిపాదన మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాకు చెందిన సోనూ సూద్ లాక్‌డౌన్ సమయంలో వలసకూలీలను ప్రత్యేక బస్సుల్లో ఇళ్లకు చేర్చి, వారి పాలిట ఆపద్బాంధవుడిగా మారారు. మానవత్వాన్ని చాటుకొని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. అంతేగాకుండా ఆయన చేసిన సేవలకు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
Next Story






