నదిలో కొట్టుకువచ్చిన శవాలు.. టెన్షన్‌‌లో స్థానికులు

by  |
నదిలో కొట్టుకువచ్చిన శవాలు.. టెన్షన్‌‌లో స్థానికులు
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో నదిలో మృతదేహాలు కొట్టుకు రావడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఈ ఘటన రామనగర జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని కన్వ నది ఒడ్డున స్థానికులు.. చనిపోయిన వారి మృతదేహాలను పూడ్చేవారు.

అయితే.. ఇటీవల భారీ వర్షాలకు నది ఉద్ధృతి పెరగడం వల్ల ఆ శవాలన్నీ నదిలో కొట్టుకుపోయాయి. హున్​సనాహల్లి-కొండాపూర్ ప్రాంతాల మధ్య ఎక్కువగా ఈ శవాలు కొట్టుకుపోవడాన్ని స్థానికులు గుర్తించారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నదిలో ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతున్నట్టు స్థానికులు వెల్లడించారు. శవాలు ఇలా నదిలో కొట్టుకు రావడంతో ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు.



Next Story

Most Viewed