బోదనెల్లి ఎన్‌కౌంటర్ మృతుడు మడివి ఉంగాల్‌గా గుర్తింపు

by Batti.Sumithra |   (  Updated:2021-08-02 21:17:15  IST  )

<p>దిశ, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బోదనెల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన మావోయిస్టు మడివి ఉంగాల్ అలియాస్ చోటుగా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పువర్తి గ్రామానికి చెందిన ఉంగాల్ నిషేధిత మావోయిస్టు అనుబంధ పీఎల్‌జీఏ ఒకటవ బెటాలియన్ కమాండర్ హిడ్మాకి సోదరుడు. అంతేగాక ఉంగాల్ అదే బెటాలియన్ సభ్యుడని కూడా పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ సమాచారం తెలియగానే పువర్తి నుంచి అతని బంధువులు వచ్చి భద్రాచలం [&hellip;]</p>

బోదనెల్లి ఎన్‌కౌంటర్ మృతుడు మడివి ఉంగాల్‌గా గుర్తింపు
X

దిశ, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బోదనెల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన మావోయిస్టు మడివి ఉంగాల్ అలియాస్ చోటుగా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పువర్తి గ్రామానికి చెందిన ఉంగాల్ నిషేధిత మావోయిస్టు అనుబంధ పీఎల్‌జీఏ ఒకటవ బెటాలియన్ కమాండర్ హిడ్మాకి సోదరుడు. అంతేగాక ఉంగాల్ అదే బెటాలియన్ సభ్యుడని కూడా పోలీసులు తెలిపారు.

ఎన్‌కౌంటర్ సమాచారం తెలియగానే పువర్తి నుంచి అతని బంధువులు వచ్చి భద్రాచలం ఆసుపత్రి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. ఆ మేరకు బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్‌పి సునీల్‌దత్ మీడియాకి తెలిపారు.

Next Story