మరడోనాకు నివాళి.. కంట తడిపెట్టిన కూతురు

by Shyam |   (  Updated:2020-11-30 11:31:27  IST  )

<p>దిశ, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ దిగ్గజం డియాగో మరడోనా నవంబర్ 25న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ వార్త విని కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణానంతరం తొలిసారి ఒక ఫుట్‌బాల్ జట్టు గ్రౌండ్‌లో ఆయనకు ఉద్వేగభరితంగా నివాళి అర్పించింది. తన కెరీర్ తొలినాళ్లతో మరడోనా అర్జెంటీనాకు చెందిన బొకా జూనియర్స్ క్లబ్ తరపున మ్యాచ్‌లు ఆడాడు. ఆదివారం బొకా జూనియర్స్, న్యూయెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్ మధ్య ఒకమ్యాచ్ [&hellip;]</p>

మరడోనాకు నివాళి.. కంట తడిపెట్టిన కూతురు
X

దిశ, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ దిగ్గజం డియాగో మరడోనా నవంబర్ 25న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ వార్త విని కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణానంతరం తొలిసారి ఒక ఫుట్‌బాల్ జట్టు గ్రౌండ్‌లో ఆయనకు ఉద్వేగభరితంగా నివాళి అర్పించింది. తన కెరీర్ తొలినాళ్లతో మరడోనా అర్జెంటీనాకు చెందిన బొకా జూనియర్స్ క్లబ్ తరపున మ్యాచ్‌లు ఆడాడు. ఆదివారం బొకా జూనియర్స్, న్యూయెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్ మధ్య ఒకమ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బొకా జూనియర్స్ జట్టు 2-0 స్కోరుతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో తొలి గోల్ చేసిన తర్వాత బొకా జూనియర్స్ జట్టు మరడోనా జెర్సీని నేలపై పరిచి నివాళులు అర్పించింది. ఆ సమయంలో గ్యాలరీలో ఉన్న మరడోనా కూతురు దాల్మా మరడోనా వైపు తిరిగి ఈ నివాళి అర్పించడంతో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెను పక్కన ఉన్న ఆమె భర్త ఓదార్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

https://twitter.com/i/status/1333179975458050049

Next Story