చిక్కుల్లో బాబీ డియోల్ ‘ఆశ్రమ్ సిరీస్‌’

by  |
చిక్కుల్లో బాబీ డియోల్ ‘ఆశ్రమ్ సిరీస్‌’
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో బాబీ డియోల్, డైరెక్టర్ ప్రకాశ్ ఝా కాంబినేషన్‌లో తెరకెక్కిన సిరీస్ ‘ఆశ్రమ్’. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. నవంబర్ 11న ఎంఎక్స్ ప్లేయర్‌లో విడుదలైన సీజన్‌2 కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నా.. ప్రస్తుతం చిక్కుల్లో పడింది. సిరీస్‌లో బాబాగా కనిపించే బాబీ డియోల్ క్యారెక్టర్.. హిందువుల మనోభావాలు కించపరిచేలా ఉందని జోధ్‌పూర్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. డియోల్‌ను అవినీతిపరుడు, మాదకద్రవ్యాల వ్యాపారి, అమ్మాయిలపై అత్యాచారం చేసే బాబాగా చూపించారని.. ఇది సాధువులను ఆరాధించే, గౌరవించే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు ఖుష్ ఖండేల్వాల్. కాగా జనవరి 11న కేసును విచారించనుంది జోధ్‌పూర్ కోర్టు.


Next Story

Most Viewed