ధర్మపూరి హిల్స్‌లో బ్లాస్టింగ్స్.. భయాందోళనలో స్థానికులు

by Batti.Sumithra |

<p>దిశ, నిజామాబాద్ సిటీ: ప్రజల జీవితాలను పణంగా పెట్టి బండరాళ్లను పేలుస్తున్నారు కొందరు. అది కూడా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా.. జిలిటెన్ స్టిక్స్ పెట్టి పేల్చడం గమనార్హం. నిజామాబాద్ నగరం13వ డివిజన్‌లోని ధర్మపూరి హిల్స్‌లో మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల నిర్మాణం జరుగుతున్నది. ఈ ప్రాంతం సమీపంలో చాలా మంది పేదలు ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. కానీ, ఇప్పుడు అక్కడ బాంబులతో బండరాళ్లను ధ్వంసం చేసే పనులు చేస్తున్నారు. ధర్మపూరి హిల్స్ అంటేనే బండరాళ్లతో కూడిన ప్రాంతం. [&hellip;]</p>

ధర్మపూరి హిల్స్‌లో బ్లాస్టింగ్స్.. భయాందోళనలో స్థానికులు
X

దిశ, నిజామాబాద్ సిటీ: ప్రజల జీవితాలను పణంగా పెట్టి బండరాళ్లను పేలుస్తున్నారు కొందరు. అది కూడా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా.. జిలిటెన్ స్టిక్స్ పెట్టి పేల్చడం గమనార్హం. నిజామాబాద్ నగరం13వ డివిజన్‌లోని ధర్మపూరి హిల్స్‌లో మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల నిర్మాణం జరుగుతున్నది. ఈ ప్రాంతం సమీపంలో చాలా మంది పేదలు ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. కానీ, ఇప్పుడు అక్కడ బాంబులతో బండరాళ్లను ధ్వంసం చేసే పనులు చేస్తున్నారు.

ధర్మపూరి హిల్స్ అంటేనే బండరాళ్లతో కూడిన ప్రాంతం. సర్కారు స్థలం ఎక్కువగా ఉందని అ స్థలంలో మైనార్టీ బాలికల గురుకుల నిర్మాణానికి కేటాయించారు. రూ. కోట్ల వ్యయంతో భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ స్థలంలో ఉన్న బండరాళ్లను పేల్చివేస్తున్నారు. వాటి కోసం జిలిటెన్ స్టిక్స్, కంప్రెషర్ వాడుతున్నప్పటికీ అనుమతులు తీసుకోలేదు. ఈ స్థలం సమీపంలోనే పోలీస్ స్టేషన్‌ ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోనే బ్లాస్టింగ్‌ను పట్టించుకోలేని అధికారులు.. మారుమూల ప్రాంతాల్లో పట్టించుకుంటారా అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

Next Story