‘హౌ యూ లైక్ దట్’.. యూట్యూబ్ రికార్డు బ్రేక్!

by  |
‘హౌ యూ లైక్ దట్’.. యూట్యూబ్ రికార్డు బ్రేక్!
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ కొరియన్ పాప్ మ్యూజిక్ బ్యాండ్స్‌లో ఒకటైన ‘బ్లాక్ పింక్’ నుంచి ఇటీవలే విడుదలైన సింగిల్ సాంగ్ ‘హౌ యూ లైక్ దట్’ యూట్యూబ్‌లో రికార్డ్ సృష్టించింది. జూన్ 26న విడుదలైన ఈ పాటను కేవలం 24 గంటల్లోనే 82.4 మిలియన్ల మంది వీక్షించడంతో.. ఒక్క రోజులోనే అతి ఎక్కువమంది చూసిన వీడియోగా రికార్డు సృష్టించింది.

బ్లాక్ పింక్ నుంచి విడుదలైన ‘సోర్ క్యాండీ’, ‘కిల్ దిస్ లవ్’ పాటలు ఇప్పటికే ప్రపంచ సంగీతాభిమానులను ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ పాప్ గ్రూప్‌తో అమెరికన్ ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్, బిజినెస్ వుమెన్ ‘లేడీ గాగా’ సైతం జట్టు కట్టింది. కాగా సౌత్ కొరియాకు చెందిన ఈ బ్యాండ్‌ సభ్యులంతా మహిళలే. వారే జిస్సో, జెన్నీ, రోస్, లిసా. 2016 నుంచి వీళ్లు ఆల్బమ్స్ రూపొందిస్తుండగా.. బిల్‌బోర్డ్ వరల్డ్ డిజిటల్ సాంగ్స్ సేల్స్ చార్ట్ లిస్టులో చేరిన తొలి పాప్ గర్ల్ గ్రూప్ ఇదే కావడం విశేషం.

లేడీ గాగాతో కలిసిన తర్వాత విడుదలైన రెండో సింగిల్ ‘హౌ యు లైక్ దట్’. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 140 మిలియన్ల మందికి పైగా చూశారు. అంతేకాదు స్పోటీఫైలోనూ ఒకే రోజు 4 మిలియన్ల మంది చూడటమూ ఓ రికార్డే. బ్లాక్ పింక్ నుంచి గతేడాది వచ్చిన ‘కిల్ దిస్ లవ్’ కూడా 100 మిలియన్లను ఫాస్టెస్ట్‌గా దక్కించుకున్న మ్యూజిక్ వీడియోగా రికార్డు సృష్టించింది.

సౌత్ కొరియాకు చెందిన మరో పాప్ బ్యాండ్ బీటీఎస్. వీరి నుంచి వచ్చిన ‘బాయ్ విత్ లవ్’ అనే పాట కేవలం 24 గంటల్లో 74.6 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఈ రికార్డును ఇప్పుడు ‘హౌ యూ లైక్ దట్ ’ బ్రేక్ చేసింది.

Next Story

Most Viewed