- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
50 పైగా స్థానాల్లో విజయం: మనోజ్ తివారీ
by Ramesh Goud |
<p> ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ధీమా వ్యక్తం చేశారు. 50కి పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. యమునా విహార్‌లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో తివారీ శనివారం ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓటింగ్ రోజు తనతో ఉండేందుకు వారం రోజుల క్రితం తన తల్లి బనారస్ నుంచి వచ్చిందని చెప్పారు. అమ్మ ఆశీస్సులు […]</p>

X
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ధీమా వ్యక్తం చేశారు. 50కి పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. యమునా విహార్‌లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో తివారీ శనివారం ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓటింగ్ రోజు తనతో ఉండేందుకు వారం రోజుల క్రితం తన తల్లి బనారస్ నుంచి వచ్చిందని చెప్పారు. అమ్మ ఆశీస్సులు తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని తన నమ్మక అని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరవుతారని అడిగినప్పుడు ‘అంతా సజావుగానే జరుగుతుంది’ అంటూ తివారీ క్లుప్తంగా సమాధానమిచ్చారు. 70 అసెంబ్లీ నియోజవర్గాలకు గాను ఒకే విడతలో శనివారం పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటలతో పోలింగ్ ముగుస్తుంది. ఈనెల 11న ఓట్లు ఫలితాలు వెల్లడికానున్నాయి.
Next Story






