- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీహార్ కోసం బీజేపీ ముందు జాగ్రత్త!
by Shamantha N |
<p>త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఢిల్లీ ఎన్నికల్లో పరాజయానికి గల కారణాలను సమీక్షించి అవి బీహార్‌లో పునరావృతం కాకుండా చూసుకునేందుకు పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో పరాజయానికి పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలూ ఒక కారణమని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కాబట్టి పార్టీ నేతలు వాటికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దియోబంద్ పట్టణాన్ని టెర్రరిజానికి గంగోత్రిలాంటిదని వర్ణిస్తూ కొత్త […]</p>

X
త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఢిల్లీ ఎన్నికల్లో పరాజయానికి గల కారణాలను సమీక్షించి అవి బీహార్‌లో పునరావృతం కాకుండా చూసుకునేందుకు పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో పరాజయానికి పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలూ ఒక కారణమని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కాబట్టి పార్టీ నేతలు వాటికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దియోబంద్ పట్టణాన్ని టెర్రరిజానికి గంగోత్రిలాంటిదని వర్ణిస్తూ కొత్త వివాదానికి తెరతీసిన బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్‌ను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మందలించినట్టు సమాచారం. గిరిరాజ్ సింగ్‌కు సమన్లు జారీ చేయడం గమనార్హం.
Next Story






