- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే.. గిరిజన బాలిక మృతి
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గిరిజన బాలిక అత్యాచారానికి గురై, మృతి చెందినదని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ ఆరోపించారు. బాలిక మరణానికి కారకులైన నిందితులను పట్టుకోవడంలోనూ ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. శుక్రవారం బాలిక స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా పిక్లా తండాలోని బాలిక తల్లిదండ్రులను బీజేపీ గిరిజన మోర్చా నాయకులు పరమార్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. నిందితులను వెంటనే […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గిరిజన బాలిక అత్యాచారానికి గురై, మృతి చెందినదని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ ఆరోపించారు. బాలిక మరణానికి కారకులైన నిందితులను పట్టుకోవడంలోనూ ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. శుక్రవారం బాలిక స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా పిక్లా తండాలోని బాలిక తల్లిదండ్రులను బీజేపీ గిరిజన మోర్చా నాయకులు పరమార్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన అమ్మాయి చనిపోయి వారం రోజులు గడుస్తున్నా.. నేరస్థులను పట్టుకోవడంలేదని హుస్సేన్ నాయక్ విమర్శించారు. నిందితులను వెంటనే పట్టుకొని పూర్తిస్థాయి విచారణ జరిపి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story






