- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలి: బండి సంజయ్
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేసిన సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరోనా వైరస్‌పై తప్పుడు వార్తల్ని ప్రచురించారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రిపోర్టర్‌పై కేసు నమోదుచేడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కక్షసాధింపు చర్యలకు, అణచివేతకు సీఎం కేసీఆర్ పర్యాయపదంగా మారారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జర్నలిస్ట్‌లపై అక్రమ కేసులు నమోదు చేయడం కాదని, కరోనాపై అసత్య […]</p>

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేసిన సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరోనా వైరస్‌పై తప్పుడు వార్తల్ని ప్రచురించారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రిపోర్టర్‌పై కేసు నమోదుచేడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కక్షసాధింపు చర్యలకు, అణచివేతకు సీఎం కేసీఆర్ పర్యాయపదంగా మారారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జర్నలిస్ట్‌లపై అక్రమ కేసులు నమోదు చేయడం కాదని, కరోనాపై అసత్య ప్రకటనలు చేసినందుకు కేసీఆర్‌పైనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పారాసిటమాల్ టాబ్లెట్ మింగితే కరోనా రాదని, 20డిగ్రీల సెల్సియస్ వేడిలో కరోనా బతకదని యావత్ తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ తప్పుదారి పట్టించారన్నారు. వేడి నీళ్లు తాగితే కరోనా రాదని మంత్రులు సైతం మభ్యపెడుతున్నారని విమర్శించారు. పత్రికా యాజమాన్యాలకు, విలేకరులకు కరోనా రావాలని శపించిన కేసీఆర్ వైఖరిని ప్రజలు గమనించారన్నారు. కరోనా వైరస్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో విలయతాండవం చేస్తున్నా పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అదే విషయాన్ని ప్రస్తావించిన జర్నలిస్ట్‌లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.






