దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపల్లికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ… త్వరలో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రానుందని అన్నారు. నేరస్థులను కొమ్ముకాస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేరోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. అంతేగకాకుండా కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత యూనియన్ లీడర్‌గా అంతా తన చేతుల్లోనే పెట్టుకుందని విమర్శించారు. కవితకు తాను ఇచ్చే మెసేజ్ ఒక్కటే అని, దోపిడీ దొంగలను బీజేపీ ఎప్పడూ వదిపెట్టదు అని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై కేంద్ర హోంశాఖ, సీబీఐకి నివేదిక సమర్పిస్తామని అన్నారు. దోషులకు శిక్షపడకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు.
‘కవితకు నేను ఇచ్చే మెసేజ్ ఒక్కటే’
గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబర్ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..