కేటీఆర్‌పై కౌంటర్ ఎటాక్‌కు బీజేపీ రె‘ఢీ’

222
KTR BJP

దిశ,తెలంగాణ బ్యూరో: బీజేపీ, పీఎం మోడీ, అమిత్ షాపై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై కమలం నేతలు గుస్స అవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిడితే ఇక ముందు సహించబోమని, సీఎంను తిట్టినా.. సోషల్ మీడియాలో ఆయనపై అనవసరమైన పోస్టులు పెట్టిన కేసులు నమోదు చేయిస్తామని సోమవారం వరంగల్ పర్యాటనలో కేటీఆర్ హెచ్చరించారు. అంతేగాక, బీజేపీ నేతలు ఇప్పటికైనా తమ భాష మార్చుకోకుంటే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అని కూడా చూడకుండా ఉతికి ఆరేస్తామని.. ఇదే బీజేపీ నేతలకు చివరి హెచ్చరికంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం గరం గరం అవుతోంది. మంత్రికి గట్టి సమాధానమివ్వాలని బీజేపీ భావిస్తోంది.

అందులో భాగంగానే కేసీఆర్,కేటీఆర్ లు వివిధ సందర్భాల్లో బీజేపీని టార్గెట్ చేస్తూ.. చేసిన అభ్యంతకరమైన కామెంట్స్, స్టేట్ మెంట్స్, వీడియోలను సేకరించాలని రాష్ట్ర నాయకత్వం పార్టీ ఐటి సెల్ కు సూచించినట్లు సమాచారం. సీఎంను గౌరవించాలని చెబుతున్న మంత్రి తారకరామారావు ప్రధానిపై కేసీఆర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రజలకు గుర్తు చేయాలని భావిస్తోంది. దేశ ఉన్నత పదవిలో ఉన్న ప్రధాని మోడీపై కనీసం గౌరవం లేకుండా కేసీఆర్ ఏకవచనంతో మాట్లాడిన వీడియోను మరోసారి చూపించడం ద్వారా సీఎంకు పీఎం పదవిపై ఏపాటి గౌరవముందో ప్రజలకు వివరించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసీఆర్ అసెంబ్లీలో విపక్షాలనుద్దేశించి చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను సేకరించి ప్రజల ముందుంచాలని అనుకుంటోంది. తెలంగాణ ఉద్యమం టైంలో కేటీఆర్ పోలీసులనుద్దేశించి చేసిన వల్గర్ కామెంట్స్ వంటివి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే భావిస్తున్నట్లు సమాచారం.

వరంగల్ లో ఐటీ మంత్రి కేటీఆర్ కు ఓ విద్యార్థి సంఘానికి సంబంధించిన స్టూడెంట్స్ ద్వారా నిరసన సెగలు తగలడంతో ఆయన తీవ్రమైన ప్రస్టేషన్ కు లోనైనట్లు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. అందుకే బీజేపీ నాయకులకు మినిస్టర్ వార్నింగ్ లు ఇస్తున్నారని అనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కేసులు పెడుతామంటూ బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ బెదిరింపులకు గురిచేస్తున్నారని భావిస్తోంది. అయితే కేటీఆర్ చేసిన హెచ్చరికలను సాప్ట్ గా తీసుకుంటే పార్టీ క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలు వెళ్లుతాయనే భావన రాష్ట్ర నాయకత్వంలో నెలకొంది. ఈ ప్రభావం సాగర్ ఉప ఎన్నికలతో పాటు త్వరలో జరగబోయే వరంగల్,ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ పై పడొచ్చని అనుకుంటుంది. అందుకే కేటీఆర్ వరంగల్ లో బీజేపీ నాయకులకు ఇచ్చిన వార్నింగ్ ను సీరియస్ గా తీసుకొని కౌంటర్ ఎటాక్ చేయాలనే నిర్ణయించింది. కేసీఆర్, కేటీఆర్ లు గతంలో ప్రధాని మోడీ, బీజేపీ,విపక్షాలపై చేసిన వీడియోలు చేతికి రాగానే మినిస్టర్ తారకరామారావు వార్నింగ్స్ కు కౌంటర్ గా ముప్పెట దాడి చేయాలని భావిస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..