- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీకి షాక్…టీఆర్‌ఎస్‌లోకి కీలక నేత
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాగా ఆయన రాజీనామా అందరిని విస్మయానికి గురిచేసింది. రాజీనామాపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….మంచి ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ కోసం బీజేపీలో చేరానని తెలిపారు. పదేండ్లుగా పార్టీకి సేవలు అందించానని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ప్రజల్లోనే ఉన్నానని ఆయన చెప్పారు. పూర్తిగా అబద్దాలతో ప్రజలను కేంద్రం మభ్యపెడుతోందని అన్నారు. బీజేపీ […]</p>

దిశ, వెబ్ డెస్క్:
తెలంగాణలో బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాగా ఆయన రాజీనామా అందరిని విస్మయానికి గురిచేసింది. రాజీనామాపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….మంచి ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ కోసం బీజేపీలో చేరానని తెలిపారు. పదేండ్లుగా పార్టీకి సేవలు అందించానని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ప్రజల్లోనే ఉన్నానని ఆయన చెప్పారు. పూర్తిగా అబద్దాలతో ప్రజలను కేంద్రం మభ్యపెడుతోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్రానికి ఎలాంటి న్యాయం జరగదని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకు పోతుందని అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన అన్నారు. వ్యవసాయ బిల్లులతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలో పని చెయ్యాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. తనతో పాటు మరికొందరు నేతలు టీఆర్ఎస్ లో చేరుతారని ఆయన తెలిపారు.






