‘నా ఇంటికెందుకొచ్చారు.. ఏందీ తమాషా’

by  |
‘నా ఇంటికెందుకొచ్చారు.. ఏందీ తమాషా’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రగతి భవన్‌ ముట్టడి చేయాలని బీజేపీ పిలుపునియడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్ట్‌లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హౌస్ అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులకు ఎంపీ ధర్మపురి అరవింద్ ఊహించని షాక్ ఇచ్చారు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఏకంగా పోలీసులను సైతం నిలదీశారు.

ఎంపీ ధర్మపురి అరవింద్ మాటలు:

బంజారాహిల్స్‌లో తన ఇంటి వద్దకు పోలీసులు రాగానే.. ఎంపీ అరవింద్..‘ ఇంత పొద్దున ఎందుకొచ్చారు ఇక్కడికి… ఏమైంది.. పటాన్‌చెరు కెమికల్ వాసన బంజరాహిల్స్‌కు వస్తోంది.. రెండు గజాల డిస్టెన్స్ మెయింటేన్ చేయండి.. హా.. ఇప్పుడేమైంది. పొద్దున్నే ఏం తమాషా.. మీకెందుకండి నా ప్రోగ్రాముల గురించి.. నేను మీకెందుకు చెబుతా నా ప్రోగ్రాముల గురించి.. ఏంది ఎందుకొచ్చారు ఇక్కడికి.. నా ఇంటి ముందు సీన్ ఏంది.. అక్కడ మా ఇంట్లో ఉన్న భార్య కాల్ చేసుకుంటా వచ్చిండా.. రాలేదా.. అని అడగడానికి మీరెవరు.. అసలు ఎందుకొచ్చారు ఇక్కడికి.. తెలుగురాదా.. ఏసీపీ ఎవరు ఫోన్ కల్పండి.. సార్ ఎవరు ఫోన్ కల్పు.. మరీ తమాషాలు ఎక్కువయ్యాయి మీవి… కేసీఆర్ పర్సనల్ అకౌంట్‌లో నుంచి జీతాలు ఇస్తుండ్రా మీకు..

ధర్మపురి అరవింద్ ఏసీబీ ఫోన్ సంభాషణ…..

ధర్మపురి.. ఏవండి ఏసీపీ గారు ఎందుకొచ్చారు పొద్దున్నే

ఏసీపీ.. సార్ సమస్కారం గుడ్ మార్నింగ్ సార్

ధర్మపురి.. హా గుడ్ మార్నింగ్ ఎందుకొచ్చారు ఇక్కడికి

ఏసీపీ.. హా ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ పిలుపినిచ్చారని..

ధర్మపురి.. ప్రగతి భవన్ ముట్టడి హా! ఎవరిచ్చిర్రు.. మీ వోడు ఉన్నాడా.. ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో ఉన్నాడా.. ఫామ్ హౌస్‌లో ఉన్నాడా..

ఏసీపీ… నవ్వులు..

ధర్మపురి నవ్వుతున్నారేమండి.. అంటూ తన ఫోన్ కాల్ సంభాషణ ముగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed