- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
<p>లక్నో: దేశమంతా కరోనాతో పోరాడుతున్న వేళ బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గానికి చెందిన వారివద్ద కూరగాయలు కొనొద్దనీ, వారివల్లే దేశంలో కరోనా కేసులు పెరిగాయని ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా బర్హాజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే సురేశ్ తివారి వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 14 సెకండ్ల నిడివి ఉన్న ఆ వీడియోలో సురేశ్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓ వర్గానికి చెందిన వారి […]</p>

లక్నో: దేశమంతా కరోనాతో పోరాడుతున్న వేళ బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గానికి చెందిన వారివద్ద కూరగాయలు కొనొద్దనీ, వారివల్లే దేశంలో కరోనా కేసులు పెరిగాయని ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా బర్హాజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే సురేశ్ తివారి వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 14 సెకండ్ల నిడివి ఉన్న ఆ వీడియోలో సురేశ్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓ వర్గానికి చెందిన
వారి వద్ద కూరగాయలు కొనొద్దు. వారి వల్లే దేశంలో కరోనా కేసులు పెరిగాయి’ అని అన్నారు. దీనిపై ప్రముఖ జాతీయ మీడియా సురేశ్‌ను వివరణ కోరగా.. ఆ వీడియోను వారం క్రితం చేసినట్టు ఒప్పుకున్నారు. ‘నా నియోజకవర్గానికి చెందిన కొంతమందితో లాక్‌డౌన్ గురించి చర్చిస్తున్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశాను. కూరగాయలకు ఉమ్మి రాస్తూ అమ్ముతున్నారనే విషయం నా దృష్టికి తీసుకురావడంతో.. వారి వద్ద కూరగాయలు కొనద్దని సలహా ఇచ్చాను. ఇందులో తప్పేముంది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, సురేశ్ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Tags: bjp mla, up, barhaj, mla suresh tiwari, vegetable sellers, corona, virus, covid 19,






