అధికారులను సస్పెండ్ చేసిన యోగి 

11

దిశ, వెబ్ డెస్క్ : యూపీ బల్లియా జిల్లాలో గురువారం చోటుచేసుకున్న కాల్పుల్లో ప్రధాన నిందితుడు, స్థానిక బీజేపీ నేత ధీరేంద్ర ప్రతాప్ సింగ్‌కు అదే పార్టీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అండగా నిలిచారు. ప్రాణాలు రక్షించుకోవడానికే నిందితుడు కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు. రేషన్ షాపుల ఎంపికపై దుర్జన్‌పుర్ గ్రామ పంచాయతీ భవన్‌లో గురువారం సబ్‌డివిజనల్ మెజిస్ట్రేట్(ఎస్‌డీఎం) సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.

వాడీవేడీగా వాదనలు సాగిన అనంతరం ధీరేంద్ర ప్రతాప్ సింగ్… జయప్రకాశ్‌పై కాల్పులు జరిపారు. దీంతో జయప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వార్త బయటకు పొక్కడంతో స్పాట్‌లో ఉన్న ఎస్‌డీఎం, సర్కిల్ ఆఫీసర్, ఇతర పోలీసులను సీఎం యోగి ఆదిత్యానాథ్ సస్పెండ్ చేశారు. కాగా, పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కనీసం ఆరుగురిని అరెస్టు చేశారు. ఇందులో ధీరంద్ర ప్రతాప్ సింగ్ సోదరుడు దేవేంద్ర ప్రతాప్ సింగ్ కూడా ఉన్నట్టు తెలిసింది.