బండి సంజయ్‌ని గుండు అంటావా..?

157

దిశ,తెలంగాణ బ్యూరో: పెద్దపల్లి ఎంపీ నేతగాని వెంకటేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని గుండు అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారని, అలా మాట్లాడే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో చూసుకుంటే బాగుంటుందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ హేద్దేవా చేశారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా,బీజేపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఎంపీ నేతగాని వెంకటేష్.. సంజయ్ పై అనవసర విమర్శలు చేస్తున్నారని, ఇకనైనా ఆయన తన పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. మహిళల పట్ల ఎంపీ వెంకటేష్ కు కనీస గౌరవం లేదని, వారిని గాడిదలతో పోల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను ఇష్టమొచ్చినట్లు తిట్టారన్నారు. 2019 లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలువగానే గతంలో తాను చేసిన కామెంట్స్ మరచిపోయి కేసీఆర్ ను పొగడడం ఆయన చౌకబారు రాజకీయాలకు నిదర్శనమన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..