దిశ, జనగామ: జనగామ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. ఈ నిరసనలో స్థానిక సీఐ మల్లేష్.. బీజేపీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలిగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 5వ తేదీన బండి సంజయ్ జనగామ పర్యటన సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాడని.. ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మ డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని రాజాసింగ్ ప్రశ్నించారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
BJP Jangaon President Pavan Sharma & Karyakartas were beaten by police during a peaceful protest against the removal of #SwamiVivekananda Jayanti banner.
Is this is what friendly policing @TelanganaDGP action needs to be taken against the officer immed @BJP4Telangana @AmitShah pic.twitter.com/NUJXcWS176
— Raja Singh (@TigerRajaSingh) January 12, 2021