బంద్‌కు పిలుపునిస్తే సొంత పార్టీ నేతల బెదిరింపు

268

దిశ, హుజూర్‌నగర్: రోడ్లు వేయాలని ప్లకార్డుతో గుంతలో భైఠాయించి బీజేపీ నాయకుడు వినూత్న నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు కన్నెగుండ్ల తిరుమలరావు.. పట్టణంలో ప్రమాదకరంగా మారిన ఇందిరా చౌక్- లింగగిరి మధ్య ఉన్న ప్రధాన రహదారిని తక్షణమే వేయించాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారి గుంతలతో ప్రమాదకరంగా మారిందన్నారు. వాహనాలన్నీ త్వరగా రిపేరుకు వస్తున్నాయని చెప్పారు. దుమ్ము, ధూళితో ప్రజలు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పట్టణ శివారులోని పరికల రామస్వామి గట్టు వద్ద నిరుపయోగంగా మారిన ఇళ్ళను మరమత్తులు చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

సొంత పార్టీ వాళ్లే బెదిరిస్తున్నారు..

పట్టణంలోని ధీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజుల క్రిందట ఈ నెల 25న మున్సిపాలిటీ బంద్‌కు పిలుపునిస్తే.. దీనిపై నేటివరకు పార్టీ జిల్లా, పట్టణ అధ్యక్షులు ఎవరూ స్పందించలేదని అన్నారు. పైగా పోలీసు స్టేషన్ లో కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. తక్షణమే పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..