అయ్యా.. ఈ ఫోటోలోని వ్యక్తి కనిపించారా..? పెద్దపల్లి ఎంపీ ఆచూకీ కోసం వాకాబు

163
Searching with MP photo

దిశ, వెబ్‌డెస్క్ : అయ్యా.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి చాలా రోజులుగా కనిపించడం లేదు. మీకు ఎక్కడైన కనిపించారా..? అమ్మా.. ఈ ఫోటోలోని మనిషిని మీరెక్కడైన చూశారా..? సార్ .. ఈ వ్యక్తి జాడ తెలిస్తే జర చెప్పండయా.. అంటూ బీజేపీ నాయకులు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ ఫోటో పట్టుకుని విధుల్లో వాకాబు చేశారు. మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి పట్టణంలోని దుకాణాల్లో, వాహనదారులను అడుగుతూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడ ఎంపీ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఆచూకీ కనిపెట్టాలని కోరారు.

BJP leaders

బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు మాట్లాడుతూ.. నాడు కేసీఆర్‌ను తిట్టిన వ్యక్తే.. నేడు ఆయన చంకన చేరి నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ప్రజల వద్దకు వెళ్లడంగానీ, ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. అప్పుడప్పుడు వచ్చే పోవడమే తప్ప.. సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదని మండిపడ్డారు. వెంటనే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..