- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే మైనంపల్లిపై బీజేపీ నేతల ఫిర్యాదు
<p>దిశ, కరీంనగర్ సిటీ : పార్లమెంట్ సభ్యుడు, బీసీ నాయకుడు బండి సంజయ్ కుమార్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అగ్రవర్ణ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఓబీసి మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలువురు నాయకులు నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్ హెచ్ఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు పత్రం అందించి, కేసు నమోదు చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి యెన్నం ప్రకాష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మైనంపల్లిపై తీవ్ర స్థాయిలో […]</p>

దిశ, కరీంనగర్ సిటీ : పార్లమెంట్ సభ్యుడు, బీసీ నాయకుడు బండి సంజయ్ కుమార్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అగ్రవర్ణ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఓబీసి మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలువురు నాయకులు నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్ హెచ్ఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు పత్రం అందించి, కేసు నమోదు చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి యెన్నం ప్రకాష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మైనంపల్లిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన కిరణ్, కరీంనగర్ పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గ జోనల్ ఇంఛార్జి మెరుగు పర్శరాం, బీజేపీ నాయకురాలు వరాల జ్యోతి, ఓబీసీ మోర్చా వెస్ట్ జోన్ అధికార ప్రతినిధి వంగల రవి గోపాల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.






