దేవాదాయ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, విశాఖపట్నం : కేంద్ర మాజీ మంత్రి, రామతీర్ధం ఆలయ మాజీ చైర్మన్‌ అశోక్‌ గజపతి రాజుపై మంత్రి వెల్లంపల్లి చేసిన వాఖ్యలు సరికాదని, వెంటనే ఆయన అశోక్ గజపతి రాజుకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు డిమాండ్‌ చేశారు. సోమవారం విశాఖలోని క్షత్రియ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వెల్లంపల్లి శ్రీనివాసు ఓ చేతకాని మంత్రిని, సీఎం జగన్ మెప్పు కోసం [&hellip;]</p>

దేవాదాయ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి
X

దిశ, విశాఖపట్నం : కేంద్ర మాజీ మంత్రి, రామతీర్ధం ఆలయ మాజీ చైర్మన్‌ అశోక్‌ గజపతి రాజుపై మంత్రి వెల్లంపల్లి చేసిన వాఖ్యలు సరికాదని, వెంటనే ఆయన అశోక్ గజపతి రాజుకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు డిమాండ్‌ చేశారు. సోమవారం విశాఖలోని క్షత్రియ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వెల్లంపల్లి శ్రీనివాసు ఓ చేతకాని మంత్రిని, సీఎం జగన్ మెప్పు కోసం అవినీతి మచ్చలేని అశోక్ గజపతి రాజు పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

దేవాదాయశాఖకు మంత్రిగా వెలంపల్లి శ్రీనివాసు అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇలాంటి మంత్రి వల్ల పార్టీలకు చెడ్డ పేరు వస్తుందని, సీఎం జగన్ శ్రీనివాసుని మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్‌ చేశారు.ఆశోక్ గజపతి రాజుకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని లేనియెడల క్షత్రియ సంఘాలు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story