పవన్ కళ్యాణ్‌ను కలిసిన సోము వీర్రాజు

108

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసారు. ఆదివారం హైదరాబాద్‌లో పవన్ ఆఫీసులో ఇరువురు సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులు, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలు, ఎంపీ అభ్యర్థి విషయమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో అభ్యర్ధిపై చర్చించాం. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. ఉభయ పార్టీల పార్టీల అభ్యర్ధిగా బరిలో దిగుతాం. బీజేపీ నా, జనసేన నుంచి అభ్యర్ధి పోటీలో ఉంటారా అనేది మాకు ముఖ్యం కాదు. ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్ధం చేశాం. 2024లో బీజేపీ, జనసేనలు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యం. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నాం. ఇరు పార్టీల ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్చించాము. కుల, మత వర్గాల బేధాలు లేకుండా.. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తాము’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..