విజయసాయిరెడ్డే చంద్రబాబు తొత్తు: దినకర్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేత దినకర్ స్పందిస్తూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడల్లా.. ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి విజయసాయిరెడ్డి ఏదో ఒక వేషం వేస్తాడని ఎద్దేవా చేశారు. అందులో ఈరోజు అమావాస్య అని&#8230; విజయసాయి అసలు వేషం బయటకొచ్చిందని అన్నారు. చంద్రబాబు అసలు తొత్తు ఈయనే అని&#8230; సీఎం జగన్ పై పగపట్టి, పిచ్చి [&hellip;]</p>

విజయసాయిరెడ్డే చంద్రబాబు తొత్తు: దినకర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేత దినకర్ స్పందిస్తూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడల్లా.. ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి విజయసాయిరెడ్డి ఏదో ఒక వేషం వేస్తాడని ఎద్దేవా చేశారు. అందులో ఈరోజు అమావాస్య అని… విజయసాయి అసలు వేషం బయటకొచ్చిందని అన్నారు. చంద్రబాబు అసలు తొత్తు ఈయనే అని… సీఎం జగన్ పై పగపట్టి, పిచ్చి సలహాలు ఇచ్చి ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నాడని దినకర్ విమర్శించారు. కాగా, కన్నాలక్ష్మీనారాయణ.. చంద్రబాబు కోవర్టు అంటు ఇటీవల విజయసాయి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Next Story